![]() |
![]() |

ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక ఈ షో అంతా కొత్తకొత్తగా ఉంది.. పాత వాళ్లంతా ఈ షోకి బైబై చెప్పేసారు. ఈ ఢీ సీజన్ 17 కి యాంకర్ గా నందు బ్లాక్ కలర్ డ్రెస్ లో ఎంట్రీ ఇచ్చాడు. అలాగే జడ్జెస్ లో శేఖర్ మాష్టర్ మాత్రమే ఉన్నారు. ఇక లేడీ జడ్జి ఉన్న పూర్ణ ప్లేస్ లో కన్నడ నటి "బావ" మూవీ హీరోయిన్ గా ప్రణీత సుభాష్ ని తీసుకొచ్చారు.
ఇక డాన్సర్స్ కూడా అందరూ లేడీస్ ఎక్కువగా కనిపించారు. ఇక ఈ షో మెగా లాంచ్ కాబోతోంది. ఈ లాంచ్ ఈవెంట్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా ఉంది. ఈ ఈవెంట్ కి "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" మూవీ టీమ్ కూడా వచ్చి నందుతో కలిసి డాన్స్ వేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఇక స్టేజి మీద ఒక భవిష్య వాణి పుస్తకం కనిపించేసరికి ఆది వచ్చి ఆ విరూపాక్ష శాసనాల గ్రంథమా అంటూ హడావిడి చేసాడు. ఈ బుక్ లో నా పేరు మీద ఏదో రాసి ఉందంటూ చదవడం స్టార్ట్ చేసాడు.." ఈ సీజన్ మొత్తం ఈ బుక్ ఏది చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి. ఈ ఎపిసోడ్ మొత్తం నువ్వు జడ్జిలా బిహేవ్ చేయాలి.." అనేసరికి ఆది వెళ్లి శేఖర్ మాష్టర్ పక్కన కుర్చీ వేసుకుని సెటిల్ ఐపోయాడు. శ్వేతా నాయుడు, శ్రీ ప్రియా, గలాటా గీతూ, కార్తీక దీపం హిమ అలియాస్ సహృద వచ్చి డాన్స్ వేసి అందరినీ అలరించారు. ఇక శ్వేతా నాయుడు గ్రీన్ కలర్ డ్రెస్ లో వచ్చి చేసిన హాట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కి స్టేజి మొత్తం హీటెక్కిపోయింది. సహృద కూడా ఇరగదీసే డాన్స్ వేసి అందరి చేతా వావ్ అనిపించుకుంది. ఈ పెర్ఫార్మెన్స్ హైలైట్ అంటూ ప్రణీత్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చేసారు. "ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం .. చేరనీ ఫైనల్స్ వరకు కర్పూర దీపం" అంటూ సహృద డాన్స్ కి కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆది.
![]() |
![]() |